అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన
ఏజెన్సీ, ప్రభుత్వం మధ్య నలుగుతున్న మెడికల్ అండ్ హెల్త్ ఎన్ హెచ్ ఎం సిబ్బంది
జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్
త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ జిల్లా ప్రతినిధి.. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తగిన వేతనాలు అందక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.ఆర్, బిస్వాల్ నేతృత్వంలోని పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సులు అమలుకాకపోవడం ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ‘సమాన పనికి సమాన వేతనం’ అనే మౌలిక సూత్రం ఇప్పటికీ అమలుకావడం లేదని, తక్కువ జీతాలతో ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడంతో శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.
ప్రభు, ఏజెన్సీ వ్యవస్థల మధ్య చిక్కుకుని నెలల తరబడి జీతాలు ఆలస్య మవుతున్నాయని, కుటుంబ అవసరాల కోసం అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని ఉద్యోగులు పేర్కొన్నారు. జీఎస్టీ పేరిట రెండో క్యాటగిరీ ఉద్యోగుల నుంచి నెలకు సుమారు రూ.4 వేల వరకు ఏజెన్సీలు కోతలు పెడుతున్నాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలన్న డిమాండ్
2016లో స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జగ్జిత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన పని చేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికి కనీస వేతనం సమానంగా చెల్లించాల్సిన హక్కు ఉందని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ తీర్పు రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు అనుగుణమని పేర్కొంటున్నారు.
బిస్వాల్ కమిటీ సిఫార్సులు పక్కన?
బిస్వాల్ కమిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 50 శాతం వేతన పెంపుతో పాటు ప్రతి ఏడాది రూ.1,000 పెంపు చేయాలని సిఫార్సు చేసినప్పటికీ, అమలులో మాత్రం కేవలం 30 శాతం పెంపుతో సరిపెట్టారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి, ఏజెన్సీల సంఖ్య పెంచడం ద్వారా కమిషన్ల భారం ఉద్యోగులపై పడుతోందని విమర్శిస్తున్నారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ, బిస్వాల్ కమిటీ లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు అమలు చేసి ఉంటే తమ జీవన పరిస్థితి వేరే లాగా ఉండేదని తెలియజేశారు.
బిస్వాల్ కమిటీ ప్రకారం వేతనాలు ఇలా.
గ్రూప్ I
12,000 వేతనం ఉన్నవారికి 19,000
గ్రూప్ II
₹15,600 ఉన్నవారికి 22,900
గ్రూప్ III 17,500 ₹31,040
కానీ, 30 శాతం పెంపుతో క్యాటగిరి ! ఉద్యోగులకు నాలుగో తరగతి ఉద్యోగులకు రాష్ట్రంలో రూ.15,600, వేతనం రావాలి కానీ ప్రభుత్వం ఓన్లీ 10,000 మాత్రమే ఇస్తున్నారు.. గ్రూప్ II ఉద్యోగులకు రూ.19,500, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 15000 మాత్రమే వేతనం చెల్లిస్తుంది… గ్రూప్ I ఉద్యోగులకు ఇస్తున్నారు.. గ్రూప్ III కనిస వేతన 31040 రూపాయలు రావాలి రూ.22,750 మాత్రమే అందుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు తులు మెరుగ్గా ఉండేవని అన్నారు.
రాష్ట్ర మాజీ సీఎస్ ఎ. శాంతి కుమారి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నివేదిక తమకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా 2026 ఏప్రిల్ 1 నుంచి జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికి సమాన పనికి సమాన వేతనం’ అమలు చేయాలని డిమాండ్ చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


