Advanced IT Skills Training Center : ఆర్‌.ఎస్‌.ఆర్. లో అడ్వాన్స్‌డ్ ఐ.టీ‌ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 16: నెల్లూరు జిల్లా: కడనూతల… బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామి రెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నాడు ఐసీటీ అకాడమీ సహకారంతో అడ్వాన్స్‌డ్ ఐటీ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ డిజిటల్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమం, ఐ.సి.టీ, అకాడమీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్. ఆర్) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంవల్ల విద్యార్థులకు పరిశ్రమలకు అనుగుణమైన డిజిటల్ నైపుణ్యాలను అందించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐ.సీ.టీ, అకాడమీ రిలేషన్‌షిప్ మేనేజర్ , నాగేశ్వరయ్య, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి. ప్రశాంత్ లు పాల్గొని ప్రసంగిస్తూ
ఈ తరహా కార్యక్రమాల వల్ల విద్యాసంస్థలు మరియు పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు. అలాగే
ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలపై ప్రయోగాత్మక శిక్షణ అందించబడుతుందనీ, భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలను పొందడానికి దోహదపడుతుం దని తెలిపారు. అలాగే రెడింగ్టన్ ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థలలో ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా మార్గాలను సుగమం చేస్తుంది. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో మొత్తం 60 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు ,సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్” అవార్డు ప్రదానం చేయబడింది. డిజిటల్ రంగంలో ప్రతిభను పెంపొందించడంలో కళాశాల చేస్తున్న కృషికి ఇది గుర్తింపుగా లభించింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ఐసీటీ అకాడమీకి కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. భవిష్యత్తులో కూడా విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో పోటీ చేయగల నైపుణ్యాలతో తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.
ఈ కార్యక్రమము లో ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్. రెడ్డి, ఐక్యూఏసీ & ఐ.ఐ.సీ, అధ్యక్షులు డా. బి. సత్యనారాయణ రెడ్డి, ఏవో ఆర్ వి రమణారెడ్డి,అన్ని విభాగాల అధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Advanced IT Skills Training Center in R.S.R.

You cannot copy content of this page

Scroll to Top