జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 01 at 11.58.28 AM

TRINETHRAM NEWS

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవిలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అన్నారు.

రూరల్ నియోజకవర్గ పరిధిలో ఓటరు అవగాహనా బైక్ ర్యాలీ నిర్వహించారు.

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యతని వారు అన్నారు.

డీలక్స్ సెంటర్ వద్ద కలెక్టర్ మాదవిలత జెండా ఊపి ర్యాలీ ప్రారంబించారు.

అక్కడ నుండి కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్,ఐ ఎల్ టి డి, బాలాజీ పేట మీదుగా డీమార్ట్ పక్కన ఉన్న గ్రౌండ్ వద్దకు ర్యాలీ చేరుకుంది.

అక్కడ ఓటు హక్కు వినియోగంకు సంబంధించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్,కడియం మండలాలతో పాటు అర్బన్ లో వార్డులకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page