సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Vinayaka

-దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

Vinayaka : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 18, త్రినేత్రం న్యూస్. విఘ్నాలు తొలగించి విజయాలను అందించే దైవంగా వినాయకుడిని హిందూ సమాజం భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటుందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం దేవరకొండ పట్టణంలోని 17వార్డులో వినాయకునీ వద్ద మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……దైవ పూజలు, ధార్మిక క్రతువులను విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించడం ద్వారా హిందూ సంప్రదాయాల్లో గణనాయకుడికి తొలి ప్రాధాన్యతను ఇస్తామని ఆయన పేర్కొన్నారు.పిల్లలు, పెద్దలు అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం తిరిగి గాడిన పడాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుతూ ఏకదంతుడిని ప్రార్థిస్తున్నట్లు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.
ఈకార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్,బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, వెల్లుగురి వల్లపు రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,కౌన్సిలర్లు కేతవత్ రుప్లా నాయక్, పొట్ట మధు, జెల్లఅంజి,వెంకటయ్య,వెంకటేష్,నరేష్,తదితరులు పాల్గొన్నారు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page