సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Denied Access Welfare Schemes

Denied Access Welfare Schemes : అరకులోయ, సెప్టెంబరు 19, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ మండలం బోండం పంచాయతీలో డీఎల్‌సీ ఆమోదం పొందిన 64 మంది ఆదివాసీ రైతులకు తక్షణమే కొండపోడు (ఆర్‌ఓఎఫ్‌ఆర్) పట్టాలు పంపిణీ చేయాలని సీపీఎం మండల నాయకులు గత్తుం బుజ్జిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించి అనంతరం నిరసన చేపట్టారు.
2024 నుంచి పట్టాల కోసం దరఖాస్తు చేసుకుని 9వ, 10వ డీఎల్‌సీల్లో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటివరకు పట్టాలు పంపిణీ చేయకపోవడం వల్ల రైతులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని బుజ్జిబాబు అన్నారు. డీఎల్‌సీ సమావేశాలను సకాలంలో నిర్వహించి పెండింగ్‌ క్లెయిమ్‌లను పరిష్కరించాలని కోరారు. బోండం పంచాయతీకి చెందిన 64 మంది రైతుల పేర్లను జిల్లా డీఎల్‌సీలో ఆమోదించి వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని, లేనిపక్షంలో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కృష్ణారావు, అప్పారావు, జగత్‌రాయ్, రంభ, విరాస్వామ్మీ, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page