జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 29 at 3.14.00 PM

TRINETHRAM NEWS

దరివాదకొత్తపాలెం గ్రామస్తులు వైసిపీ నుండి టీడీపీ లో చేరిక

వర్మ తోనే మేము అంటున్న దరివాదకొత్తపాలెం రెడ్డి సామాజికవర్గ నాయకులు

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు కావూరి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో దరివాదకొత్తపాలెం గ్రామానికి చెందిన 16మంది వైసిపీ నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి చేతులమీదుగా తెలుగుదేశం పార్టీ కండువకప్పుకొని పార్టీ లోకి చేరారు.

👉 నియోజకవర్గంలో రోజు రోజుకు వలసల పర్వం కొనసాగుతూ ఉంది

👉 ప్రతిపక్ష నాయకుడి నడవడిక అధికార పక్షంలో గుబులు రేపుతున్నాయి.ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామాలలో పర్యటనలు చేస్తుంటే అపూర్వ స్పందన లభిస్తోంది

👉 దీనిలో భాగంగా దరివాదకొత్త పాలెం గ్రామనికి చెందిన సుమారు 16 మంది ఈ రోజు టీడీపీ బాపట్ల నియోజకవర్గ బాధ్యులు వేగేశన నరేంద్ర ఆధ్వర్యంలో టీడీపీ లో చేరారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

👉 అధికార పార్టీ లో ఉన్న నాయకుడు ప్రవర్తన వలనే ఇలా టీడీపీ లో చేరాల్సిన వొచ్చింది అన్నారు.

👉 వర్మ న్యాయకత్వ లో తాము నిబద్ధతతో నడుస్తామన్నారు.టీడీపీ విజయం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు

ఈ కార్యక్రమంలో అక్కల అయ్యప్ప రెడ్డి,ఆసోది వెంకన్న రెడ్డి, మంచాల సుబ్రహ్మణ్యం రెడ్డి, మంచాల సాంబిరెడ్డి,ఆసోది వీరారెడ్డి, ఆవుల సుబ్బయ్య, పిట్టు రామకృష్ణారెడ్డి, ఆసొది శ్రీనివాసరెడ్డి, దుండి వెంకటేశ్వర్లు రెడ్డి, ఆసోది కనక రెడ్డి, కుంచాల పోలిరెడ్డి, కోకి శివారెడ్డి, మంచాల రవీంద్ర రెడ్డి, మరుప్రోలు శ్రీకాంత్ రెడ్డి, పెట్టు గణేష్ రెడ్డి, అక్కల కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page