
Vijayamma : Mar 18, 2026, త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ : కుటుంబంలో వాటాల పంపిణీ వివాదంలో తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నానని వైఎస్ విజయమ్మ తెలిపారు. షర్మిలకు బినామీగా కానీ ప్రతినిధిగా కానీ వ్యవహరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతిరెడ్డిల గిఫ్ట్‌డీడ్ ద్వారా తనకు ప్రయోజనం ఉందని, క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. ఈ పత్రాలను ఎవరూ తిరస్కరించలేరని, జగన్ కూడా తనపట్ల ఉన్న ప్రేమను నిరాకరించలేడని చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

