మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గౌరవనీయులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సూచనల మేరకు కార్యాలయంలో ఘనంగా విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబండ వర్గాల పోరాటం అమరులు త్యాగం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు అయినా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రథసారథి కేసీఆర్ 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి తెలంగాణ ప్రకటన వెలువడేలా చేసిన చారిత్రక రోజు ఈరోజు సందర్భంగా ఘనంగా విజయ్ దివాస్ కార్యక్రమం జరుపుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


