Collector P Prashanthi : పిడిఎస్ బియ్యం పంపిణీ పై విజిలెన్స్ మరింత విస్తృత పరచాలి

TRINETHRAM NEWS

లక్ష్యాల నిర్ధారణలో అలసత్వం చూపవద్దు..

కలెక్టర్ పి ప్రశాంతి

Trinethram News : రాజమహేంద్రవరం : రబీ సీజన్లో ధాన్యం సేకరణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేసుకునే విధానంలో దిగుబడుల అంచనా మేరకు లక్ష్యాలను నిర్దేశించు కోవాలని, పిడిఎస్ లక్ష్యాలను అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకునే బాధ్యత, అందుకు అనుగుణంగా ఫోర్టిఫైడ్ రైస్ నిల్వలు జిల్లా మేనేజర్ (పౌర సరఫరాల) పై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.

శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తో రబీ ధాన్యం సేకరణ, సి ఎమ్ ఆర్ లక్ష్యాలు, పిడిఎస్ బియ్యం పంపిణీ, కెర్నల్ వెరైటీ, రబీ సీజన్ ప్రారంభం నాటికి స్టాక్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రబీ సీజన్లో ధాన్యం సేకరణ విషయంలో నిర్ధిష్టమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, ఆమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. పిడిఎస్ బియ్యం సరఫరా విధానం లో ఎటువంటి అవకతవకలు లేకుండా పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. సీజన్ ప్రారంభం నాటికి ముందే పిడిఎస్ బియ్యం కోసం నిర్దేశించుకున్న ఫోర్టిఫైడ్ రైస్ నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సిఎమ్ఆర్ కింద 27,722 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ విషయంలో ఇప్పటి వరకు 22,533 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి అయిందని, వాటికి సంబంధించి రసీదు నిర్ధారణ చేసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన 5,191మెట్రిక్ టన్నులకు మిల్లుల నుంచి రసీదులు పొందాల్సి ఉందన్నారు.

పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రజా పంపిణీ కోసం కేటాయించే వరిలో సూక్ష్మపోషకాలను జోడించడం కోసం అవసరమైన ఫోర్టిఫైడ్ రైస్ ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మిల్లింగ్ , ప్రాసెసింగ్ సమయంలో వరి లో కోల్పోయిన సూక్ష్మపోషకాలను పునరుద్ధరించడానికి, ఇతర విటమిన్లు మరియు ఖనిజాలను జోడించడం ద్వారా విటమిన్లు మరియు ఖనిజాల స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించిన బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ నిర్దేశించిన పాళ్లలో కలప వలసి ఉంటుందన్నారు. సిఎమ్ఆర్ మిల్లులు వద్ద ధాన్యం నిల్వలు, ధాన్యం ఆడడం ద్వారా ఉత్పత్తి అయిన బియ్యం, అంతకు ముందు మిల్లులు వద్ద ఉన్న స్టాక్ తనిఖీ చేసుకుని మాత్రమే నిర్ధారణ చేయాలన్నారు. పునర్ వినియోగ విధానం పై దృష్టి పెట్టడం తప్పని సరి అన్నారు.

ఇందు కోసం అవసరమైన విజిలెన్స్ కార్యక్రమాలు సమాంతరంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లాకు  1258.664 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చెయ్యగా, జిల్లాలో 232 ఎమ్ టి లు వినియోగించగా , 67 ఎమ్. టి లు  నెల్లూరుకు , ఇంకా 789 ఎమ్ టి లు గోడౌన్ స్టాక్ రూపంలో ఉన్నట్లు తెలిపారు. ఇంకా 181.58 ఎమ్ టి లు నిలవ ఉందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించిన బియ్యంలో ఫోర్టిఫైడ్ పోషక విలువలు పెంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటి విషయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందు కోసం రవాణా వ్యవస్థ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పర్యవేక్షణా తప్పనిసరి చెయ్య లన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు , ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్.. ప్రేమ్ కుమార్, జిల్లా మేనేజర్ టి రాధిక, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vigilance should be further

You cannot copy content of this page

Scroll to Top