నవంబర్ 22, 2026
TRINETHRAM NEWS
Victory belongs to Alliance

Victory belongs to Alliance : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 02 ; జీలుగుమిల్లి మండలం, రాచన్నగూడెం గ్రామపంచాయతీ లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన పార్టీ కూటమి అభ్యర్థి వెన్నం మాధవి మాట్లాడుతూ, గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అద్భుతంగా ఉందని తెలిపారు.

దేశంలో ప్రధాన మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని వెల్లడించారు. ఆ గ్రామపంచాయతీలో ఓటు హక్కు కలిగి ఉన్నవాళ్లు ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆమెను గెలిపిస్తే సమన్వయంగా అభివృద్ధికి, సంక్షేమానికి తోడ్పడి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page