అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
BJP Holds Meeting

BJP Holds Meeting : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 05 ; పార్టీ ఆదేశాల మేరకు కుక్కునూరుమండలం లో మండల కమిటీ సమావేశం ఘనంగా జరిగింది .ఈ సమావేశం లో పల్లె పండుగ 3.0 గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రహదారులు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం మొదలుపెడుతోంది. వీబిజి రామ్ జీ పల్లె పండుగ 3.0 కింద రూ.5,838 కోట్లతో 8,571 కిలోమీటర్లు గ్రామీణ రహదారులను నిర్మాణం చేయనుంది.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తో పాటు డ్రైనేజి వ్యవస్థ లను బలోపేతం చేస్తూ పంచాయితీ భవనాలు మౌలిక వసతులు కల్పించనుంది. మరియు పల్లె పండుగ 3.0 కింద కుక్కునూరు మండలానికి 9 బీటి రోడ్లు మంజూరు చేసారని భాజపా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ పలు అంశాల పైన చర్చించడం జరిగింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం, మరియు పంచాయతీ నుంచి బిజెపి తరపున సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గా అయినా పోటీ చేసి గెలుపొందాలని పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి అభ్యర్థులందరిని గెలిపించుకుందామని మండల అధ్యక్షులు కె వి ఎన్ దొర పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ధార్మిక సెల్ కో – కన్వీనర్ వాడపల్లి లక్ష్మణచార్యులు, ప్రధాన కార్యదర్శి బాలమణి కుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రాచమడుగు వరలక్ష్మి, ఎస్టీ మోర్చా అధ్యక్షులు బిట్టా అప్పారావు, కార్యవర్గ సభ్యులు బొల్లు చైతన్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page