నవంబర్ 22, 2026
TRINETHRAM NEWS
Janni Kamala

Janni Kamala : అరకు లోయ నవంబర్ 3, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం స్థానిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో గ్రామాల్లో ప్రచార సందడి పెరుగుతోంది. పెదలబుడు సెగ్మెంట్-2 పరిధిలోని శరభగూడ గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి జన్ని కమల ఎంపీటీసీగా పోటీ చేస్తుండడంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కుండ గుర్తుతో బరిలో నిలిచిన ఆమె ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను నేరుగా కలుస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా ఓటర్లకు స్వయంగా బ్యాలెట్ పత్రాన్ని చూపిస్తూ కుండ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తనకు ఒక్క అవకాశం కల్పించాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని కమల హామీ ఇస్తున్నారు.
“మీకు ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో నేనున్నా. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించండి.. నా పనితీరుతో నిరూపించుకుంటాను” అని ఆమె ఓటర్లను కోరుతున్నారు.
ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నట్లు జన్ని కమల తెలిపారు. కుండ గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీగా పోటీ చేస్తున్న ఆమె ప్రచారం ప్రస్తుతం పెదలబుడు సెగ్మెంట్-2 పరిధిలో కొనసాగుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page