అక్టోబర్ 27, 2026
TRINETHRAM NEWS
Alliance Candidate

Alliance Candidate : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 27 ; జీలుగుమిల్లి మండలం, దర్భ గూడెం ఎంపీటీసీ స్థానంలో కూటమి (తెలుగుదేశం, జనసేన భారతీయ జనతా పార్టీ) జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో దర్బగూడెం కూటమి ఉమ్మడి ఎంపీటీసీ అభ్యర్థి పద్దం వెంకటకృష్ణకు బర్రింకలపాడు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని చిర్రి బాలరాజు ఆశీస్సులు అందజేశారు. వెంకటకృష్ణ మాట్లాడుతూ, విజయం మనదే. అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
బీ-ఫామ్ అందజేసిన అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి సాధించాలంటే నిరంతరం ప్రజల్లో ఉండే సమర్థుడైన నాయకుడు కావాలని, అందుకే పద్దం వెంకటకృష్ణను అభ్యర్థిగా నిలబెట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం, వెంకటకృష్ణకు ఉన్న ప్రజాదరణతో స్థానంలో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా దర్బగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని మౌలిక వసతుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ప్రజల సేవకే అంకితం అని పద్దం వెంకటకృష్ణ వెల్లడించారు. తనపై నమ్మకంతో ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు, కూటమి పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యులు దిశా నిర్దేశంలో దర్బగూడెం పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ 24 గంటలు అందుబాటులో ఉంటూ, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేర్చుతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రముఖులు మరియు దర్బగూడెం పంచాయతీ పరిధిలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పద్దం వెంకటకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page