Yaramati Venkannababu : ఎన్నికల నిర్వహణలో బీఎల్వోల పాత్ర కీలకం

TRINETHRAM NEWS

వైసీపీ నాయకుడు యారమాటి వెంకన్నబాబు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట: మండపేట అసెంబ్లీ నియోజకవర్గం (48) ఓటర్ నమోదు అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పీ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గంలో బీఎల్వోల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ పీఏ మెహర్ బాబా ఆధ్వర్యంలో బీఎల్వోలు శిక్షణ పొందారు. పట్టణ పరిధిలో ఉన్న 64 నుండి 109 వరకు గల పోలింగ్ స్టేషన్ లకు సంబంధించిన బీఎల్వోలకు ఏడిద సచివాలయం వెల్ఫర్ అసిస్టెంట్ నాగం నాగశివ శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణా తరగతులలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఐటీ వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు హాజరై శిక్షణా తరగతులను పరిశీలించారు. వెంకన్నబాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా బూత్ లెవెల్ అధికారుల పాత్ర చాలా కీలకమని ఈ శిక్షణా తరగతులు వల్ల పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుందన్నారు. పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని ప్రజల వద్దకు వెళ్ళి కొత్త ఓట్లు నమోదు, చేర్పులు, మార్పులు గురించి అవగాహన కల్పించే విధంగా సిద్ధం కావాలని తెలిపారు. ఎన్నికల విధులు, బాధ్యతలు, ఫారం-6, 6 ఏ, 7, 8, 9, 10, 11, 11ఏ, 11బి, 12, 13  14 లపై శిక్షణ  ఇచ్చారు. ఎన్నికల కమీషన్  నుండి వచ్చిన గూగుల్ లింక్  ద్వారా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ, ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్యాలయపు సిబ్బంది, 64 నుండి 109 వరకూ ఉన్న పోలింగ్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The role of BLOs

You cannot copy content of this page

Scroll to Top