జూలై 5, 2026

IMG 20240926 WA0003

TRINETHRAM NEWS

Veeranari chakali Ailamma birthday celebrations

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో : చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య

Trinethram News : Vikarabad : చేవెళ్ళ నియోజకవర్గం : 26/09/2024

చేవెళ్ళ మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ..

ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపిన తెగువ అందరికీ ఆదర్శమని తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు చిట్యాల ఐలమ్మ అని అన్నారు. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమం లో భాగస్వామ్యం కావడంలో ఆమె స్ఫూర్తి ఎక్కువ అని తెలిపారు. ఉద్యమ పోరాటంలో మహిళల పాత్ర అసమానమైనది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు,వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Veeranari chakali Ailamma birthday celebrations

You cannot copy content of this page