
Veera Hanuman Vijaya Yatra : డిండి (గుండ్ల పల్లి ) ఏప్రిల్03, త్రినేత్రం న్యూస్. హనుమాన్ జయంతి వేడుక లను పురస్కరించుకొని, దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ ఆలయంలోని హనుమాన్ విగ్రహానికి గురువారం ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు .సాయంత్రం స్థానిక చెన్నకేశ్వర స్వామి దేవాలయము నుండి శ్రీరాముడు ,హనుమాన్ విగ్రహాలను వాహనం మీద అలంకరించి భారీ శోభాయాత్రగా బయలుదేరి పురవీధుల గుండా శ్రీరామ నామం స్మరిస్తూ, భజనలు చేస్తూ, భక్తులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో, శోభాయాత్రలో పాల్గొన్నారు.
శోభాయాత్ర ముందు భాగాన కోలాటంలచే, భజనలచే, నృత్యములచే, కోలాహలంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ, దేదీప్యమానంగా కాంతులు విరజిమ్ముతో ,గ్రామంలో భారీగా శోభాయాత్ర నిర్వహించి చూపరులను ఆకట్టుకుంది. రాజకీయాలకతీతంగా గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో కార్యక్రమములో పాలుపంచుకున్నారు .
ఈ కార్యక్రమంలో చెన్నకేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు హనుమాన్ కేశవులు, హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు వంగాల ప్రవీణ్ రెడ్డి ,స్థానిక సర్పంచ్ నల్లగంతుల రవి, కమిటీ సభ్యులు ఏటి కృష్ణ, శ్రీనివాస్ గౌడ్ ,నల్ల గంతుల వెంకటయ్య , గుర్రం రాములు, అమృత్ ,పున్న దినేష్ ,గడ్డమీద సాయి, జయవర్ధన్, ఖయ్యూం పీర్ మహమ్మద్ ,దుబ్బా రాకేష్ రెడ్డి , ఎలకుర్తి జైపాల్, వేణు గోపాల్ ,మాధవ్ గౌడ్, బల్ముల తిరుపతయ్య,,వావిలాసలయ్య.గుర్రం రాములు ,ఐలేష్ చారి,,శ్రీశైలం రషీద్, రాధిక, మాకం సైదులు,కర్నాటి అజయ్, శివాజీ ,గుర్రం సురేష్ సతీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

