Hanuman Jayanti : 22 న హనుమాన్ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

Trinethram News : రాజమండ్రి,మే20: హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 22 వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక పుష్కర, ఘాట్ గోషాడ గోసాయి వారి సన్నిధి మఠంలో బ్రహ్మశ్రీ బొండాడ దుర్గా రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామివారికి అభిషేకం,పండ్ల రసాలతో విశేషపూజలు నిర్వహిస్తారు. గత 24 సంవత్సరాల నుంచి ఈ మఠంలో హనుమాన్ జయంతికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రసాద్ సిద్ధాంతి తెలిపారు.నగర ప్రముఖులు, తన శిష్య బృందంతో నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని బ్రహ్మశ్రీ బొండాడ దుర్గా ప్రసాద్ సిద్ధాంతి కోరారు.అనంతరం భక్తులకు మామిడిపండ్లు వితరణ జరుగుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hanuman Jayanti celebrations on

You cannot copy content of this page

Scroll to Top