కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 3 :వాసవి విద్యా ట్రస్ట్ ప్రతియేటా చేపడుతున్న విద్యా ప్రోత్సాహ కార్యక్రమం కింద ఈ ఏడాది 37 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం రూ. 8.5 లక్షల స్కాలర్‌షిప్‌లను ఆదివారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ డుబ్బా అనిల్, చైర్మన్ కోతమాను మురళీధర్, అధ్యక్షుడు తాడేపల్లి వెంకటేశం, మాచికాంతి వెంకట్రమణ పాల్గొని చెక్కులను విద్యార్థులకు అందజేశారు.విద్యా రంగ అభివృద్ధికి, విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ట్రస్ట్ కట్టుబడి ఉందని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


