Validation Act 2025 : రిటైర్డ్ ఉద్యోగులకు యమ పాశం లాంటి వాలిడేషన్ యాక్ట్ 2025 ఉపసంహరించాలి

TRINETHRAM NEWS
Validation Act 2025

Validation Act 2025 : దేవరకొండ డివిజన్, మార్చి 25, త్రినేత్రం న్యూస్. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నాయకత్వంలో వాలిడేషన్ యాక్ట్ 2025 మార్చి లో పార్లమెంట్లో ఆమోదం పొందడం రిటైర్డ్ ఉద్యోగులకు యమపాశం లాంటిదని, దేవరకొండ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తాడిశెట్టి నరసింహ, అంకం చంద్రమౌళి అన్నారు.

బుధవారం దేవరకొండలో ఆర్డీవో కార్యాలయం ముందు, ఎమ్మార్వో కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి, జిల్లా కలెక్టర్కు అందే విధంగా మెమోరండం అందజేశారు. ఈ సందర్భంలో అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలిడేషన్ ఆక్ట్ 20 25 రిటైర్డ్ ఉద్యోగులకు యమపాశం లాంటిదని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కోశాధికారి పంగులూరు లింగయ్య, సహా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ ,పడమటి శాంతకుమారి, గంధం వసంత, మనం బుచ్చయ్య, మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, సత్యమూర్తి బలుసాని సత్యనారాయణ ,తాడిశెట్టి సుదర్శన్, వీరయ్య ,మౌలానా, వెంకన్న, గుమ్మడవెల్లి కోటయ్య, సల్వాది పెద్దులు, లాలూ నాయక్ తో సహా 40 మంది రిటైర్డ్ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top