Vaddepalli Rajeswara Rao : జై రామన్ 3డి స్టూడియోను ప్రారంభించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

TRINETHRAM NEWS
Vaddepalli Rajeswara Rao

Vaddepalli Rajeswara Rao : కూకట్పల్లి మార్చి 29 (త్రినేత్రం న్యూస్) : కూకట్ పల్లి వివేకానంద నగర్‌లో జై రామన్ 3డి స్టూడియో ప్రారంభోత్సవం అద్భుతంగా, ఘనంగా జరిగింది. సీతారామయ్య ఆహ్వానం మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన 3డి ఫోటోగ్రఫీ సేవలు అందించాలని స్టూడియో నిర్వాహకులను కోరారు. కాలనీవాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లాభపడాలని ఆకాంక్షించారు.

ప్రారంభోత్సవ వేడుకలో స్థానికులు, అభిమానులు, పలు ప్రముఖులు పాల్గొనడంతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top