TELANGANA

MLA K.P. Vivekananda : నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పి. వివేకానంద 125 డివిజన్ గాజులారామారం పరిధిలోని దేవేందర్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “తాజ్ బేకరి” షాపును ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వయం ఉపాధి ద్వారా వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఇలాంటి వ్యాపారాలు ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే బేకరీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిజేస్తూ, వినియోగదారులకు సరసమైన ధరలతో నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తూ వ్యాపారం మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కస్తూరి బాలరాజు, పాక్స్ చైర్మన్ పరుష శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ సాయి, మాక్సూద్ భాయ్, చెట్ల వెంకటేష్, నాగేష్, సుంకరి చందు, తారా సింగ్, దాసరం లక్ష్మణ్, రాజు, జునైద్, శివ నాయక్, నవీన్, చందు గౌడ్, ఉపేందర్ రెడ్డి, సుంకరి శివ, లక్ష్మి, సంపంగి నరసింహ మరియు స్థానికులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Unemployed youth should not just wait for jobs

You cannot copy content of this page