దళిత ముస్లిం యువకులను నడిరోడ్డుపై అకృత్యానికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయాలి
ఆపారాల శాఖ మహాసభలో
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
రాజమండ్రి మే 29 : దేశంలో రోజురోజుకి నిరుద్యోగం పెరిగి పనులు లేక దేశ యువత మానసిక ఆందోళనకు గురవుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు . గురువారం మధ్యాహ్నం స్థానిక అపరాల సెక్షన్ సిపిఐ శాఖ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ బహిరంగ సభకు సిపిఐ శాఖ కార్యదర్శి జి హరినాథ్ అధ్యక్షత వహించారు
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతి ఏడాది డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసుకుని నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక పనిచేస్తామంటే పనులు లేక కొన్ని రాష్ట్రాల్లో అర్ధాలతో అలమటిస్తున్నారని మధు ఆరోపించారు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయలేదని యువతరం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు
గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను అత్యంత ఖరాంతకంగా నడిరోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్లపై విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు అంతేకాకుండా ఆ పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం శిక్షించాలని మధు కోరారు
ఈ సమావేశములో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ, టౌన్ కార్యవర్గ సభ్యులు పి లావణ్య, టీ నాగేశ్వరరావు, నల్ల రామారావు, టీ త్రిమూర్తులు, జట్ల సంఘం అధికారబాడి అప్పల నాయుడు, అపరాల సెక్షన్ కార్యదర్శి కె వేణు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


