క్యాంటీన్ ను సందర్శించిన నాయకులు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో గతంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన రోటీ మేకర్ ప్రారంబించక పోవడం మూలంగా రోటీ మేకర్ మిషన్ వృధాగా పడి తుప్పు పట్టిన సందర్భంగా, వాటిని తిరిగి బాగు చేసి ప్రారంభించాలని గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆర్జీ వన్ యాజమాన్యం తో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశం లో కోరిన మేరకు యాజమాన్యం తిరిగి రోటీ మేకర్ ను సంబంధించిన కంపెనీ తో మాట్లాడి బాగు చేసి ప్రారంభం చేయడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు పేర్కొన్నారు.
శుక్రవారం జిడికె వన్ ఇంక్లైన్ క్యాంటీన్ ను వారు సందర్శించిన అనంతరం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అన్ని క్యాంటీన్ లలో చపాతీ కోసం రోటీ మేకర్ మిషన్ లను కొనుగోలు చేసి ప్రారంబించ లేదని, దీని వల్ల అవి వృధాగా పడి ఉన్నాయని వాటిని బాగు చేసి ప్రారంభించాలని కార్మికులు అడిగిన మేరకు వాటిని తిరిగి వాడుకలోకి తేవడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మానాల శ్రీనివాస్, కలవేణి రాజేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


