2 Twins Married : ఇద్దరు మగ కవల పిల్లలు ఇద్దరు ఆగడు కవల పిల్లలు కు పెళ్లి ఘనంగా జరిగింది.

TRINETHRAM NEWS

నిజాంబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

Trinethram News : నిజామాబాద్‌ : ఒకటి కాదు రెండు జంటలు.కవలలైన యువకులిద్దరు.. కవలలైన అమ్మాయిలను ఒకే ముహూర్తానికి వివాహమాడారు. అదీ.. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజున.జరిగిన అరుదైన వివాహ మహోత్సవానికి కామారెడ్డి జిల్లా కేంద్ర శివారు లింగాపూర్‌లోని కల్యాణ మండపం వేదికగా నిలిచింది.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన దుంపటి విజయ్‌కుమార్, వినయ్‌కుమార్‌లిద్దరూ కవలలు. వీరికి ఇదే జిల్లా తాడ్వాయి మండలం దేమీకలాన్‌ గ్రామానికి చెందిన కవలలు కుమ్మరి కీర్తన, కీర్తితో పెద్దలు వివాహం నిశ్చయించారు.

రెండు జంటలు బంధుమిత్రుల సమక్షంలో, వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యాయి. నవదంపతులు విజయ్‌కుమార్‌-కీర్తన, వినయ్‌కుమార్‌-కీర్తి అందరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Two male twins and two fraternal twins got married

You cannot copy content of this page

Scroll to Top