MLA KP Vivekanand : అయ్యప్ప 18వ మహా పడిపూజ ఏర్పాట్లను పరిశీలించిన, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ సుచిత్ర చౌరస్తాలోని టిఎన్ఆర్ నార్త్ సిటీ మాల్ ప్రక్కన ఈనెల 6వ తేదీన తత్వమసి సేవా సమాజం, కుత్బుల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 18 పడుల మహా పడిపూజ కార్యక్రమ పనులను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పేట్ బషీరాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, తత్వమసి సేవా సమాజం సభ్యులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తత్వమసి సేవా సమాజం ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన టిఎన్ఆర్ నార్త్ సిటీ మల్టీప్లెక్స్ ప్రక్కనగల స్థలంలో నిర్వహించనున్న 18 పడులతో మహా పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కార్యక్రమ నిర్వాహకులకు సూచించారు. అలాగే పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు రానున్నందున ట్రాఫిక్ సమస్య కలగకుండా సిబ్బందిని నియమించి ట్రాఫిక్ రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో తత్వమసి సేవా సంఘం సభ్యులు చంద్రం స్వామి, మురళీకృష్ణ స్వామి, జైహింద్ గౌడ్, నాగరాజు స్వామి, కృష్ణారెడ్డి స్వామి, శ్రీధర్ స్వామి, శివకుమార్ స్వామి, కుంట సిద్ధిరాములు గురుస్వామి, కృపాకర్ రాజు స్వామి, స్థానిక బిఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, నరేందర్ రెడ్డి, కాలే గణేష్, కుంట వేణు, బాల మల్లేష్, విజయ్ హరీష్, జయరాం, రమేష్, వెంకటేష్ నాయి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA KP Vivekanand inspected the arrangements Maha Padi Puja

You cannot copy content of this page

Scroll to Top