MLA KP. Vivekanand : బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు సుభాష్ నగర్ పైప్లైన్ రోడ్డులో నూతనంగా చేపడుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వివిధ శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను దాదాపు 56 కోట్ల రూపాయలతో చేపడుతున్నామని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసిపి వెంకట్ రాంరెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ ఈఈ శ్రీనాథ్ రెడ్డి, డీఈఈ వెంకట రమణ, ఏఈఈ శోభన్ జిహెచ్ఎంసి ఈఈ లక్ష్మీ గణేష్, డీఈ పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bridge construction work should be completed quickly

You cannot copy content of this page

Scroll to Top