డిండి( గుండ్లపల్లి) నవంబర్ 21 త్రినేత్రం న్యూస్. డిండి మండల టీఎస్ యుటిఎఫ్ మహాసభలను జడ్.పి.హెచ్.ఎస్ డిండి యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాస్ చారి ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మరియు రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ నల్ల నరసింహ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డి ఏ లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రధాన కార్యదర్శి పెరుమల వెంకటేశం మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని మోడల్ స్కూల్ టీచర్లకు వేతనాలను చెల్లించాలని వారు కోరారు.
మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా గంధ మల్ల రామారావు ప్రధాన కార్యదర్శిగా నా రోజు పవన్, ఉపాధ్యక్షులుగా కే హరిలాల్, ఎం సుజాత కోశాధికారిగా సిహెచ్ రాంబాబు, సోషల్ మీడియా కన్వీనర్ గా సిహెచ్ సందీప్, కేజీవీబీ కన్వీనర్గా మహమ్మద్ ఖాజా రహమతుల్లా లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


