YSR Jayanti : ప్రజా హృదయ విజేత వైయస్‌ఆర్ కి జయంతి సందర్భంగా ఘన నివాళి

TRINETHRAM NEWS

అనపర్తి: త్రినేత్ర న్యూస్ ప్రతినిధి. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానేత, సామాన్యుడి బాగోగులు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, 76వ జయంతిని బాలవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పాల్గొని వైయస్‌ఆర్, సేవలను స్మరించుకున్నారు.
డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ:
వైయస్‌ఆర్, ప్రజల ఆశల ప్రతిరూపం. రైతు నుంచి విద్యార్థి వరకు ప్రతి ఒక్కరి జీవితం మెరుగుపడాలని అనుకున్న నాయకుడు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చాయి అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మందనక్క తులసి రావు (గ్రామ శాఖ అధ్యక్షులు),గోలి రమణ (పంచాయతీ సర్పంచ్) , కర్రిపోతు సత్యనారాయణ, పూలమాటి చిట్టబ్బాయి, మందనక్క దాసు, పూలమాటి రాఘవరావు, కోటి బాబ్జి, మేడిశెట్టి మరిడయ్య, కోమ కృపారావు తదితరులు పార్టీ నాయకులు, మండల నేతలు, యువజన విభాగం ప్రతినిధులు, మహిళా విభాగం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైయస్‌ఆర్, పట్ల తమ అపారమైన ప్రేమను చాటుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribute to the winner

You cannot copy content of this page

Scroll to Top