దేవరకొండ జులై 08 త్రినేత్రం న్యూస్. ప్రజా సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి, పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి,తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని తన నివాసంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి సేవలను ఎం ఎల్ ఏ బాలు నాయక్ కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రైతుల అభ్యున్నతి, పేదల సంక్షేమం, మహిళా సాధికారత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం,108 సేవలు, రూ.2 కే కిలో బియ్యం, రైతుల పొలాలను తడిపేందుకు జలయజ్ఞం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


