Tribal Leaders : బంజారా సామాజిక వర్గానికి మంత్రి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకి కలిసిన గిరిజన సంఘ నాయకులు

TRINETHRAM NEWS

దేవరకొండ జూన్ 06 త్రినేత్రం న్యూస్. జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బంజారా సమాజానికి స్థానం కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరిన గిరిజన సంఘ నాయకులు. కేతావత్ బాబురామ్ నాయక్ మరియు కొర్ర.లక్ పతి చౌహన్, గురువారం నాడు ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ ని వారి స్వగృహంలో కలవడం జరిగింది అలాగే (AICC) ఆఫీస్ లో రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ , మల్లికాహార్జున్ ఖర్గే , తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ కి లేఖలు సమర్పించారు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి బంజారా సమాజం ఏకతాటిపైకి వచ్చి 42 నియోజకవర్గాలలో అధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చారు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి మెదక్ జిల్లాలో బంజారా సమావేశం అధికంగా ఉన్నారు బంజారా సమాజం ఎక్కడైతే ఉన్నారో అక్కడే కాంగ్రెస్ పార్టీ గెలిచింది బంజారా సమాజం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలిపింది కావున మా బంజారా సమాజాన్ని గుర్తించి మంత్రి పదవిలో స్థానం కల్పించాలని బంజారా సంఘాల నుండి విజ్ఞప్తి చేస్తున్నాముఅని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribal leaders meet Congress

You cannot copy content of this page

Scroll to Top