జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Ketawat Bheelya Naik

BRS రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్.

Ketawat Bheelya Naik : పి ఎ పల్లి మే22, త్రినేత్రం న్యూస్. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేటిఆర్ ఆదేశానుసారం పి ఎ పల్లి మండలం అంగడిపేట గేట్ వద్ద హైవే పై వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ధర్న కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల విషయంలో శాపంగా మారిందని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు కొనె దిక్కు లేదన్నారు.

రోజుల తరబడి వేచిచూసిన గాని కాంట వేసి లారిలల్లొ మిల్లులకు తరలించే వారు లేరని రోజుల పాటు వడ్ల కుప్పల దగ్గర కాపల వుండాల్సి వస్థుందని .మరోపక్క కట్ షిట్ లేకుండా తాలు పేరిటి మిల్లర్ లతో కుమ్మకై నిలువు దోపిడి చేస్థున్నారు అని అన్నారు కేసిఆర్ హాయం లో రైతు ఆనందంగా వున్నారని మళ్లీ కేసిఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని రైతు ఎడ్చిన రాజ్యం బాగుపడి నట్లు చరిత్ర లో లేదని మళ్ళి పోరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన అండగా వుంటుందని .

వడ్లు కొనుగోలు చేసి లారీ ల కొరత తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . కేసిఆర్ రైతు బంధు, రైతు బీమా తో రైతులను ఆదుకున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవరకొండ నియెజక వర్గ నాయకులు కేతావత్ భిల్యా నాయక్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వల్లపు రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సరిత నర్సింహ,గుడిపల్లి సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి,ముత్యం రావు,తోట కూరి పరమేష్, మండల కార్యదర్శి మారుపాక జగన్,ఎర్ర యాదగిరి,చిలక మర్రి సర్పంచ్ దూదిపాల రాజెందర్ రెడ్డి,వడ్డి పట్ల సర్పంచ్ శ్రీను, సర్పంచ్ కిషన్ నాయక్, సర్పంచ్ ఆడేపు నాగేష్,మునగాల అంజి రెడ్డి,బోడ్డుపల్లి మహెందర్,కర్నాటి రవి,రమావత్ శ్రీను, హరి నాయక్, జైపాల్ నాయక్,మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page