WhatsApp Image 2024 05 23 at 10.56.18
Today is the funeral of President of Iran Ibrahim Raisi
Trinethram News : ఇరాన్ : మే 23
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించు కుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు ప్రకటించింది.
అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్ పట్టణంలో శవపేటికలతో సంతాప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లదుస్తులతో, ఇరాన్ జెండాలు పట్టుకుని ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
కాగా ఇవాళ రైసీ అంత్య క్రియలు నిర్వహించను న్నారు. ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి భారత్ తరపున అధి కారికంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నివాళుల ర్పించనున్నారు. ఈ క్రమం లో ఆయన ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన అధ్యక్షుడు, ఆ దేశ విదేశాంగ మంత్రికి భారత్ తరపున నివాళుల ర్పిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
