మనల్ని మనవాళ్లే మోసం చేయడం అంటే ఇదే

TRINETHRAM NEWS

నాడు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడా మాట్లాడకుండా మౌనం వహించారు

ఉద్యమించే వారిని అణచివేసి మోసం చేశారు… ఉద్యమాన్ని బలహీనపరిచారు

చట్టాలు చేయగలిగే పదవుల్లో ఉండి కూడా మౌనం దాల్చారు

నేడు అసలైన ఉద్యమం నీరుగారిపోయేలా వారి రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాన్ని వాడుతున్నారు
Trinethram News : గిరిజనులను గిరిజనులే మోసం చేయడం అంటే ఇదేనేమో? గత ఐదేళ్ల కాలంగా జరుగుతున్న తంతే నేడు ఆ నేతల వల్ల గిరిజనులకు జరుగుతోంది… గిరిజన నిరుద్యోగుల పక్షాన ఆదివాసి సమాజం పక్షాన వారు చూపిస్తున్న దుర్బుద్ధి, దురుద్దేశం వల్ల వెనకబడిన సమాజం మరింత మరింతగా వెనకబడేలా చేస్తోంది… నిజమైన ఆదివాసి హక్కుల కోసం పోరాడే ఉద్యమాన్ని నాడు వారి నిరంకుశ విధానాలతో అణచివేశారు…. నేడు ఉద్యమాన్ని రాజకీయం చేసి నీరుగారిపోయేలా వ్యూహాలు పన్నారు. ఉద్యమం చేసేవారికి ఎవరు మద్దతు పలికిన ఆహ్వానించాలి అని అనడము, ఆహ్వానించడం మంచి పరిణామం…. కానీ అవతలి వ్యక్తులు ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితి ఉందో లేదో కూడా సూక్ష్మ పరిశీలనతో ముందుకు వెళ్లక పోతే ఉద్యమ సాధన మొత్తానికే నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది.

కేవలం ఒకరో ఇద్దరో కాదు…. ఆదివాసి ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటే అంత మంది కూడా ఏక మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన గిరిజన ప్రజానీకానికి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు ఏ మాదిరిగా మోసం చేశారో ఈరోజు వారి మోసంతో నష్టపోతున్న ఆదివాసీ సమాజానికి అర్థమవుతుంది…. వాస్తవానికి గత ఐదేళ్ల కాలంలో ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం వలన, ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం వలన జీవో నెంబర్ మూడు ప్రాధాన్యతను, మనం అంటే గిరిజన సమాజం అంతగా గుర్తించలేకపోయింది….ప్రస్తుతం దాని తీవ్రతను భవిష్యత్తులో జరిగే నష్టాన్ని గుర్తించిన ప్రజా సంఘాలు ఇతర ఉద్యమ నాయకులు జీవో నెంబర్ 3 పై తీవ్ర స్థాయిలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు…. కానీ ఎక్కడికక్కడ ఉద్యమాన్ని నీరుగార్చి ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు…. ఆ జాగ్రత్తపడే విషయంలో నిజమైన ఉద్యమాన్ని అణచివేసే విషయంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాటి ప్రభుత్వంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్టీ కమిషన్ సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వివిధ హోదాల్లో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నామినేటెడ్ పదవులను వెలగబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలక భూమిక పోషించారు. ఇది ఎవరు అవునాన్నా కాదన్నా గిరిజన సమాజం అంతటికీ తెలిసిన విషయమే.

నాడు జీవో నెంబర్ మూడు గురించి గానీ స్పెషల్ డిఎస్సీ గురించి గానీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ గురించి గానీ ఆదివాసి ప్రజాసంఘాలు ఉద్యమ నాయకులు ఏక మొత్తంలో ఉద్యమిస్తున్నప్పుడు జనసేన పార్టీ పూర్తిస్థాయి మద్దతు తెలిపింది…. వారితో కలిసి నడిచింది… కానీ క్రెడిట్ ఎవరికో పోతుందని ప్రభుత్వానికి, జగన్ కి చెడ్డ పేరు వస్తుందని ఉద్యమం బలహీనపరిచేందుకు అణిచివేంచేందుకు నాటి ప్రజా ప్రతినిధులు అంతా సహకరించారన్నది సుస్పష్టం.నిరుద్యోగం అనుభవిస్తున్న ప్రతి విద్యావంతులకు తెలుసు

ఆ ఐదేళ్లు ఎందుకు నోరు మెదపలేదు?
నిజంగా గిరిజనుల సంక్షేమాన్ని గాని గిరిజనుల శ్రేయస్సు కోరే వారు ఎవరైనా సరే ఆదివాసీలు బాగుండాలని తపిస్తారు…. వారికి చేతనైన సాయం చేస్తారు. కానీ ఈరోజు గిరిజన సంఘం చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చాలని వ్యూహ రచన చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆ రోజు చట్టసభల్లో ఉన్నారు. ఇప్పుడు పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు , ఆరోజు ఎస్టీ కమిషన్ సభ్యుడు ఈరోజు శాసన మండలి సభ్యుడుగా ఉన్న కుంభా రవిబాబు ఆరోజు ఎస్టీ కమిషన్ చైర్మన్. ఈరోజు అరకు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న గుమ్మా తనుజారాణి మామగారు చెట్టి ఫాల్గున అరకు శాసనసభ్యులు, ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడు…. ఇటువంటి పదవులుతో ఐదేళ్లు కొనసాగారు…బాధ్యత విషయంలో వీళ్లపై వీళ్ళకే స్పష్టత లేదు అధి వైసీపీ నాయకులకు రాదు వాళ్ళని ఉద్యమంలో భాగస్వామ్యం చేసి వ్రుదా ప్రయాస సగటు ప్రతి గిరిజన గ్రాడ్యుయేట్ ఆలోచన విధానం ఇదే…

గిరిజనులకు అన్యాయం జరుగుతున్నప్పుడు గానీ గిరిజన బిడ్డలు అకాల మృత్యువాత పడుతున్నప్పుడు గానీ చిన్నారులు ఐదేళ్ల లోపే చనిపోతున్నప్పుడు గానీ, నిరుద్యోగ యువతకి అన్యాయం జరుగుతున్నప్పుడు గానీ, వాళ్ల పక్షాన నిలవలసిన ఎస్టీ కమిషన్ ఒక్క రోజైనా వాళ్ల గురించి మాట్లాడిందా?

మరి మేము మాట్లాడలేదా? అని అనే వాళ్లకు నాది ఒకటే సూటి ప్రశ్న. గత ఐదేళ్లలో ఒక్కసారైనా జీవో నెంబర్ మూడు గురించి ఈ ఎస్టీ కమిషన్ ఎప్పుడైనా మాట్లాడిందా? ఎస్టీ అడ్వైజరీ కమిటీ ఎప్పుడైనా చర్చించిందా? ఈరోజు పాడేరు శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తి ఆరోజు ఎస్టి కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. గిరిజనుల హక్కులు హననం జరుగుతున్నప్పుడు ఈ సభ్యుడు ఎక్కడికి వెళ్లారు. ఆదివాసి ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తున్నప్పుడు కనీసం ఎందుకు నోరు మెదపలేదు?… అంటే వీరి పదవులను కాపాడుకోవడం కోసం రాజకీయ భవిష్యత్తు కోసం గిరిజనుల రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెట్టారు… ఇటీవల జరిగిన పాడేరు ఐటిడిఏ పాలకవర్గ సమావేశంలో కుంభా రవిబాబుతో కూడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అంతా జీవో నెంబర్ మూడు గురించి పట్టు బట్టారు. ఇది సంతోషదాయకం. కానీ ఇలాంటి పట్టు ఈ తరహా ప్రతిఘటన వాళ్లు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ప్రతిఘటించి అడిగి ఉంటే నేడు వారి నాయకత్వ సమర్ధత పై గిరిజన ప్రజలకు నమ్మకం కలిగేది కానీ అలా చేయకుండా సభ రసాభాస చేసి మరొక మారు మేము గిరిజన ద్రోహులమని నిరూపించుకున్నారు.అదే ఆరోజు మన నాయకులు వారి నాయకుడిని అడిగివుంటే ఈరోజు విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ లో 2024 ఉద్యోగాలు గిరిజనులకే దక్కేవి. ఇది నిజమా? కాదా? గిరిజన ప్రజానీకం ఈ విషయాన్ని స్పష్టంగా సూక్ష్మంగా పరిశీలించాలన్నది నా మనవి. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం మెగాడీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది.
చెప్పింది చెప్పినట్టుగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో 2024 జాబులు గిరిజన ప్రాంతానికి కేటాయించారు. నిజంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ జరిగ లేదు. పునరుద్ధరణ జరగడానికి అవకాశం లేదని తెలిసినప్పుడు కనీసం ప్రత్యామ్నాయ ఆలోచన చేసైనా సరే ఆ 2024 ఉద్యోగాలు కూడా గిరిజనులకే కచ్చితంగా దక్కి ఉండేవి. మరి ఈ పని ఆనాటి ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభారావు బాబు ఎందుకు చేయలేదు? ప్రభుత్వానికి జీవో నెంబర్ మూడు పునరుద్ధరించండనీ గానీ, ప్రత్యామ్నాయ మార్గాలు చూడండనీ గానీ ఎందుకు సిఫార్సు చేయలేదు?. కుంభా రవిబాబు.
ఎస్టీ కమిషన్ సభ్యులుగా ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు, ఎస్టీ కమిషన్ సభ్యులు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు?. అప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు శాసనసభలో జీవో నెంబర్ మూడుకు ప్రత్యామ్నాయంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఒక్కసారైనా మీ అధినేత జగన్ పై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు?. అంటే ఒత్తిడి తీసుకొస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. జగన్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడితే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.అదే మీరు నమ్మిన రాజకీయాలు .. అంటే మీ అధినేత దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డారని అనంటే ఆదివాసి సమాజ ప్రయోజనాలన్నిటినీ ఆయన కాళ్ల దగ్గర పెట్టినట్టు కాదా? ఒకసారి గిరిజన ప్రజలంతా పార్టీలకతీతంగా ఆలోచన చేయాలన్నది నా మనవి..

ఆనాడు ఎందుకు విపక్షాలతో కమిటీ వేయలేదు?

వైయస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతా ఒక మాట చెబుతున్నారు… తామంతా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశామని…. రివ్యూ కొటేషన్ వేస్తే దానికి సంబంధించిన తీర్పు వచ్చి ఉంటుంది కదా తీర్పు వచ్చినప్పుడు జీవో నెంబర్ మూడు పునరుద్ధరణ సాధ్యం కాదు ఇంకా సమయం పడుతుందనీ ఆలోచన చేసినప్పుడు దీనికి ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని ఉద్యమిస్తున్న ప్రజాసంఘాలతో ఎందుకు మీరు కమిటీ వేయలేదు? ఆరోజు అంతా ఒక్కటై ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళు కనీస ఆలోచన చేయాలేని వారీగా ఎందుకు మిన్నకుండిపోయారు? విపక్షాలు డిమాండ్ చేస్తుంటే వీళ్ళు ఒక్కరోజైనా దీని గురించి ఆలోచించారా? మీ పదవులు మీకు ఉంటే చాలు అనుకున్నారే గాని గిరిజన సమాజం ఏమైపోయినా మీకు సంబంధం లేదన్నట్టుగానే ఉన్నారు కదా… మరి ఈరోజు మీరే దేశోద్ధారకులు అన్నట్టు ఆదివాసి సమాజ ఉద్ధరణ మీతోనే సాధ్యమయినట్టు ఈ కపట నాటకాలు దేనికోసం? ఆదివాసి సమాజం కోసం గిరిజన నిరుద్యోగుల కోసం ఎంతో కాలంగా ఉద్యమిస్తున్న ఆదివాసి ప్రజాసంఘాల ఉద్యమాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని నేరుగా ఉద్యమాన్ని నీరుగార్చాలని మీరు చేస్తున్నది కపట ప్రేమ కాదా? ఇది గిరిజన జాతి ద్రోహం కాద?మీరు గిరిజన ద్రోహులు కాద??

జీవో నెంబర్ 3న పునరుద్ధరించాలి లేదా ప్రత్యామ్నాయం చూపాల్సిందే

గిరిజన సమాజానికి ఆదివాసి నిరుద్యోగులకు అన్యాయం జరిగితే అధికారంలో ఉన్న లేకపోయినా మేమంతా గిరిజన పక్షమే జీవో నెంబర్ 3న పునరుద్ధరించాలి అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయని చూపాలి… ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు.. రా కదలిరా సభలో అరకులో చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3న పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆ మాటకి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం తరఫున గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా చెప్పారు. పునరుద్ధరణ సాధ్యం కాదు దానికి సాంకేతికపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత దానికి సమానమైన ప్రత్యామ్నాయ జీవోను తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.. ఆ తరహా ఆలోచన చేసేలా తామంతా ప్రభుత్వంలో ఉండి ఒత్తిడి చేస్తున్నాం. జీవో నెంబర్ మూడుకు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాల్సిందే ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాల్సిందే. అది జరిగని పక్షంలో మేమంతా కచ్చితంగా పోరాటం చేసి తీరుతాం.. గిరిజన సమాజం కోసం నిలబడతాం. అవసరమైతే ప్రభుత్వంతో కలబడతాం. ఇందులో ఎటువంటి సందేహము లేదు.

ఆ గిరిజన సమాజం శ్రేయస్సు కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని శంకించేలా, అనుమానించేలా గిరిజనుల్లో కొత్త అనుమానాలు రేకెత్తించేలా వారి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వైసిపి ఆడుతున్న డ్రామాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అధికారం ఉంటే ఒకలాగా లేకపోతే మరోలాగా వారు ఆడుతున్న దొంగనాటకాలను పరిశీలించాలన్న వినతి. మన సమాజానికి మేలు జరిగేలా గిరిజన బిడ్డలను మంచి భవిష్యత్తు తీసుకొచ్చే విధంగా ఉద్యమాలు చేద్దాం. గిరిజన ద్రోహులను నమ్మొద్దు గిరిజన ద్రోహులను మన దరికి చేరనివ్వొద్దు. గిరిజన హక్కులను కాపాడుకోవడమే ప్రతి ఒక్కరు లక్ష్యం కావాలి తప్ప వారు వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం మనం పావులు కావద్దు… సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటూ మన సమాజానికి మేలు జరిగే విధంగా మనమంతా కలిసి అడుగులు వేద్దాం
ఇట్లు
డాక్టర్ వంపూరు గంగులయ్య

                ఇంచార్జ్

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం,
అరకు పార్లమెంట్ నియోజకవర్గం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

This is what it means

You cannot copy content of this page

Scroll to Top