Trinethram News : కాలజ్ఞాన మహిమను లోకానికి చాటి చెప్పిన తత్వ బోధకుడు,సంఘ సంస్కర్త ,జన జాగృత చైతన్యమూర్తి,వీరబ్రహ్మేంద్ర స్వాములవారనీ, వారి బోధనలు అందరికీ ఆదర్శనీయమని చెంగిచర్ల విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి , ప్రధానకార్యదర్శి కట్టాహరి ప్రసాద్ లు అన్నారు.వైశాఖ శుద్ధ దశమి తేదీ 7.5.2025 రోజున చెంగిచర్ల RTCకాలనీ నందు సంఘం ఏర్పాటు చేసిన 332వ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు బ్రహ్మంగారు జీవ సమాధి పొందిన పవిత్రమైన రోజనీ , ప్రభుత్వం అధికారికంగా కార్య క్రమాల్నినిర్వహించాలన్నారు.
సంఘ ప్రతినిధులు స్థానిక వాసులు హాజరై బ్రహ్మంగారి పూజ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు వడ్ల నరసింహ్మాచారి,కోశాధికారి చెన్నోజు శ్రీనివాసా చారి, ఉపేంద్రాచారి పూజారి రాకేష్ శర్మ, రామ్మోహన్ చారి , కిషన్ చారి,కాలని వాసులు చంద్రశేఖరరెడ్డి , Ch.వెంకటయ్య,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


