అల్లూరిజిల్లా (అనంతగిరి) త్రినేత్రం న్యూస్: జూన్ 17 : గత వైయస్సార్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన మోసానికి, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేసరికి . స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్), టీజీటీ, పీజీటీ, ఎస్జీటీ పోస్టులకు అప్లికేషన్ వేసిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంత నిరుద్యోగుల సంఖ్య 10 వేల మందికి పైగా.
అయితే అందులో ఒక్క ముద్ర కూడా స్థిరంగా పడకముందే నిరుద్యోగ గిరిజన యువత గుండె చప్పుడు వినిపిస్తోంది. అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం అధికంగా కనిపిస్తున్నది. విద్యలో పురోగతి వచ్చినా, ఉపాధి అవకాశాల లేమి గిరిజనుల ఆత్మవిశ్వాసాన్ని తుడిచిపెట్టేస్తోంది. జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి గిరిజనుల నిరుద్యోగుల ఆవేదనకు చలించి మాట్లాడుతూ,
కరోనా తాకిడితో పూర్తిగా ధ్వంసమైన విద్యావ్యవస్థను గత వైయస్సార్ ప్రభుత్వం పాలనలో,నిలబెట్టే ప్రయత్నాలు చేయకపోగా, బటన్ నొక్కుడు కార్యక్రమాలకు మించిన పని చేసిన దాఖలాలు లేవు. “ఏటా డీఎస్సీ” అంటూ చెప్పిన మాటలు వాయిదా పడ్డాయి. చివరికి ఎన్నికల ముందు 6100 పోస్టులతో కేవలం ఒక నోటిఫికేషన్ ఇస్తూ గిరిజన యువత ఆశలపై నీళ్లు చల్లేశారు.
గిరిజన ప్రాంతాల్లో ఉపాధి లేక అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్లిపోతున్న యువత దుస్థితి మరింత దిగ్భ్రాంతికరంగా మారింది. చదువుకున్న పట్టాలు మోసంగా మిగిలిపోతే, నైతిక విలువలతో బ్రతకడం అసాధ్యమవుతోంది. కొంతమంది గిరిజన యువత పట్టణాలకు వలస వెళ్లి కేటరింగ్, పెయింటింగ్, బిల్డింగ్ పనుల్లో పనిచేస్తూ, తల్లిదండ్రులకు “గెస్ట్ ఫ్యాకల్టీ”గా జాబ్ చేస్తున్నామంటూ అబద్ధాలు చెబుతుండటం వెనుక ఉన్న మానసిక స్థితి ఎవరు అర్థం చేసుకుంటారు?
ఇక, జాబితాలో చోటు దక్కని “జీవో నెం.3” అంశం, గిరిజన డీఎస్సీ ఆశలను పూర్తిగా నాశనం చేసింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడాల్సిన నాయకులు, పదవుల కోసమే పోటీ పడుతుండడం దురదృష్టకరం. అధికారంలో ఉన్నప్పుడు గళం విప్పని వారు, ఇప్పుడు అబద్ధపు ఉపన్యాసాలతో జనాన్ని మభ్యపెడుతున్నారు.
ప్రతీ గ్రామంలో గుడి, చర్చ్ ఉండొచ్చు… కానీ బడి లేదు! కొన్నిచోట్ల పశువుల షెడ్లలో విద్యార్థులు చదువుకుంటుండటమే దీని నిదర్శనం. వర్షాలు పడితే భవనాలు లేక సెలవులు ప్రకటించే పాఠశాలలు మమేకమైపోయాయి. అయినా ఎవరు స్పందిస్తున్నారు?
ప్రజల అసంపూర్ణ చైతన్యం, తప్పుడు నాయకుల ఎంపిక – ఇవే గిరిజన ప్రాంతాల వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు. విద్యావంతులు ప్రశ్నించలేక, పోరాడే సంఘాలు ఒంటరిగా పోరాటం చేస్తుండగా, ప్రభుత్వాల కన్ను మాత్రం గిరిజన ప్రాంత ఖనిజ సంపదపైనే ఉంది. స్థానిక ప్రజల పట్ల ఒక్క పాలనాధికారికి తగిన బాధ్యత లేదన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కొంతమేరకు న్యాయం చేస్తూ గిరిజన అభివృద్ధికి కృషి చేస్తున్నా, ఒకరే మార్పు తేవలేడు. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలంతా కలిసే మార్పు సాధ్యమవుతుంది. పౌరులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి సమర్థవంతమైన నాయకులను ఎన్నుకున్నప్పుడే ఈ ప్రాంతానికి ఆదాయం కాకపోయినా, అయినా నష్టం జరగకుండా కాపాడగలరు.
ఈ రోజు గిరిజన ప్రాంత యువత ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్ని కాదు చాలా మేరకు అందులో, ఇది కేవలం ఒక చిన్న శాతం మాత్రమే! ఈ ఆవేదనను వినండి… స్పందించండి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


