Mutyalu : కంకర పోశారు, బిటి వేయడం మరిచారు

TRINETHRAM NEWS

బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముత్యాలు.

డిండి(గుండ్లపల్లి) జూన్ 26 త్రినేత్రం న్యూస్, డిండి మండలంలోని పలు గ్రామాలకు బిటి రోడ్లు మంజూరు కావడం జరిగింది. అందులో గద్రాల్ తండా,డాక్య తండా,వావిలికోల్ వడ్డెర గూడెం, రాస్య తండా,సోమ్లా తండా, బొగ్గులదోన గ్రామాలకు బిటి రోడ్లు మంజూరు అయ్యాయి.కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా కేవలం కంకర, డస్ట్ పోసి వదిలేసారు. దీనితో వాహన దారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం కావడంతో వాన వసై డస్ట్ మొత్తం బురదలాగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాహనదారులు వాపోతున్నారు.
సదరు కాంట్రాక్టర్ లను అడిగితె బిల్లురాకపోవడంతోనే బిటి వేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రజలు వాహనదారుల సౌకర్యార్ధం వీలైనంత త్వరగా బిటి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
కాంట్రాక్టర్ లకు బిల్లులు చెల్లించి,త్వరగా బిటి నిర్మాణం చేయాలి…
బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ముత్యాలు మండలంలో బిటి వేయకుండా అర్ధాంతరంగా మిగిలిపోయిన రోడ్లకు బిటి నిర్మాణం చేయాలని అదే తరుణంలో సంభంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని బిఆర్ఎస్ వావిలికోల్ వడ్డెర గూడెం గ్రామశాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

They poured gravel, forgot

You cannot copy content of this page

Scroll to Top