Student Talent : విద్యార్థి ప్రతిభ

TRINETHRAM NEWS

తేదీ : 26/06/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి కి చెందిన విద్యార్థి ఉండవల్లి, ఢిల్లీలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన స్టార్ట్ ప్ మహా కుంబ్ ప్రోగ్రాంలో మహిళల ఆరోగ్యం కోసం , మాగ్నా ప్యాడ్స్ పేరుతో స్మార్ట్ శానిటర్ స్యాడ్ ను రూపొందించి విశేష ప్రతిభ కనబరిచిన మంగళగిరి విద్యార్థి వనమా. వంశీని విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించడం జరిగింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో వంశీని కలిశారు. జాతీయ స్థాయిలో జరిగిన ఆ ఈవెంట్ లో దాదాపు వేయి కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభలను ప్రదర్శించడం జరుగుతుంది.
వడ్లమూడి. విజ్ఞాన్ కళాశాల లో బి. ఫార్మసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంశీ తన గైడ్ డాక్టర్ పి శ్రీనివాస్ బాబు సాయంతో హాజరై మహిళల ఆరోగ్యం కోసం తాను రూపొందించినటువంటి దానిని ఆవిష్కరించారు. తన వినూత్న ఆవిష్కరణతో రూపాయలు ఎనిమిది లక్షలు నగదు బహుమతిని గెలుచుకొని , సౌత్ ఇండియాలోనే ప్రధమంగా నిలిచాడు. దీనిని పబ్లిక్ సిటీ జరిగింది. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడని ఈ సందర్భంగా వంశీని మంత్రి లోకేష్ ప్రశంసించారు. భవిష్యత్తులో అండగా ఉంటామని, అమరావతిలో ఏర్పాటు చేయబోయే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Student Talent

You cannot copy content of this page

Scroll to Top