Ayub Ansari : భారీ వరదతో నష్టపోయిన కల్కోడ గ్రామ ప్రజలకు అండగా అయూబ్ అన్సారీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణి కష్టాల్లో అండగా ఉంటానని హామీ.. ఈటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలతో మర్పల్లి మండలం కల్కోడ, రావులపల్లి గ్రామాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సందర్శించిన వికారాబాద్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అయూబ్ అన్సారి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన కుటుంబాలను సందర్శించామని వారి పరిస్థితి దయనీయంగా ఉందని నిత్యవసరాలతో పాటు నివాసాలను కోల్పోవడం బాధాకరమన్నారు, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు ఇట్టి విజయాలను తెలిపి నష్టపోయిన కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని, ప్రస్తుతం ఆ యొక్క కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందించడం జరిగిందన్నారు, వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతు సోదరులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు, ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎదురైనా కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా తనవంతు సహాయం ఎల్లవేళలా అందిస్తానని అయూబ్ అన్సారీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ యాదవ్, సురేష్, సురేష్ కుమార్, సొసైటీ మాజీ చైర్మన్ ఫసి, అబ్రహం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ayub Ansari stands by the people

You cannot copy content of this page

Scroll to Top