తూకాల్లో తేడా రాకుండా వ్యాపారస్తులు చూసుకోవాలని
Trinethram News : లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగేంద్ర పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ రైతు బజార్లో జిల్లా లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు, వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎస్. నాగేంద్ర, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ ఈనెల 8 నుండి 20 వరకు వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, మరి ముఖ్యంగా అందరికీ తూనికలు కొలతలు పట్ల కచ్చితంగా అవగాహన ఉండాలన్నారు.
వ్యాపారస్తులు కాటాలకు లైసెన్స్ పొందాలన్నారు. ఎమ్మార్పీ కి మించి ఎక్కువ తీసుకోరాదన్నారు. అనంతరావు మాట్లాడుతూ వ్యాపారస్తులు వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగడంతో పాటు తూనికలలో తేడా లేకుండా చూసుకుంటూ నమ్మకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ తూకం వేసి డెలివరీ చేయాలన్నారు, 5 కిలోమీటర్లలోపు డెలివరీ చార్జీ వసూలు చేయరాదన్నారు. కన్జ్యూమర్స్ రైట్స్ అవేర్నెస్ సెల్ ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదు పొందాలన్నారు. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రోజియా, వినియోగదారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


