వేసవి మజ్జిగ పంపిణీ సేవలను ప్రశంసించిన లయన్స్ గవర్నర్
రాజమహేంద్రవరం, మే 13, రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు షణ్ముఖ లయన్స్ క్లబ్ ఆధ్వ ర్యంలో మండు వేసవికాలన్ని దృష్టిలో ఉంచుకొని గత 50 రోజులుగా మజ్జిగ పంపిణీ జరుగుతుంది. రోడ్డున ప్రయాణిస్తున్నఅనేకమంది ప్రజలు ఈ మజ్జిగను తాగుతూ వారి దాహార్తిని తీర్చుకొంటున్నారు. మజ్జిగ పంపిణీ ప్రారంభమై సుమారు 50వ రోజులు పూర్తయింది. 50వ రోజు కార్యక్రమానికి సెంటీనియల్ పవర్ క్లబ్, రాజమండ్రి వారు తమ సహకారం అందించారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ లయన్ ఈ వి వి ఈశ్వరకుమార్, పి డి జి లయన్. బి వి ఎన్ రెడ్డి, ఆర్. సి. లయన్ వాణిశ్రీ దంపతులు, మన జిల్లా మార్కెటింగ్ హెడ్ లయన్. సలాది శ్రీనివాస రావు, మరియు క్లబ్ మెంటార్. లయిన్. బాబుసార్ విచ్చేసి కొంతమూరు షణ్ముఖ లయన్స్ క్లబ్ చేస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించి సేవలను కొనియాడారు. గత 50రోజుల్లో సుమారుగా 20,000 మందికి మజ్జిగ పంపిణీ జరిగిందని నాగరాజు క్లబ్ సభ్యులకు వివరిం చారు. ఈ సందర్భంగా కొంతమూరు షణ్ముఖ లయన్స్ క్లబ్ కి విచ్చేసి ఆశీర్వదించిన డి. జి. కి ఇతర పెద్దలందరికీ పేరు పేరునా కొంత మూరు షణ్ముఖ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పామర్తి నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


