త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం ఎంపీడీవో ఆఫీసులో ఈరోజు అనగా శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ ముఖ్యమంత్రి సహాయనిధి మొత్తము 7 40316 రూపాయలు చెక్కులు రూపంలో పంపిణీ చేశారు. తరువాత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను పరిష్కా రించాలని అక్కడికక్కడే సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, నాయకులు పట్నం పరమేశ్వర్ రెడ్డి, గురప్ప నాయుడు, కిషోర్,సురేష్ ఎంపీడీవో , ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


