వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పరిగి పట్టణంలోని ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే& డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళకు నాణ్యమైన చీరలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లలోని చేనేత కార్మికులతో ప్రత్యేకంగా ఇవి తయారు చేయించారని పేర్కొన్నారు. మహిళా సంఘాలతో పాటు ప్రతి ఇంటి మహిళలకు ఈ చీరలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మహిళా సంఘాల తో పాటు ప్రతి మహిళకు చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి ఉమా రామ్మోహన్ రెడ్డి ఇందిరమ్మ చీరను ధరించి కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


