యూఎస్ నుంచి వెనక్కి వచ్చిన మూడో బ్యాచ్

TRINETHRAM NEWS

Trinethram News : అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారిని తిరిగి వారి దేశాలకు పంపే ప్రక్రియ వేగంగా సాగుతోంది. మనదేశం నుంచి నుంచి అక్రమంగా వలస వెళ్లిన వారిని.. అమెరికా యుద్ధ విమానంలో తీసుకొచ్చి అమృత్‌సర్‌లో దింపేస్తున్న విషయం తెలిసిందే.

గత రెండు వారాల్లో ఇప్పటికే రెండు సార్లు అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ కాగా.. సోమవారం మూడో బ్యాచ్‌తో మరోసారి అమెరికా విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ అయింది.

ఈ సారి 112 మందిని పంపారు. వీరిలో ఎక్కువ మంది హర్యానాకు చెందినవారు ఉన్నారు. హర్యానాకు చెందిన 44 మందితో పాటు, 33 మంది గుజరాత్‌, 31 మంది పంజాబ్‌కు, ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు, హిమాచల్, ఉత్తరాఖండ్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నానని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రమే 119 మందితో ఓ విమానం ల్యాండ్‌ అయింది. వెంటనే ఒక రోజు గ్యాప్‌ తర్వాత మరో 112 మందిని దింపేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top