
డిమాండ్ చేసిన అంబేద్కర్స్ ఇండియా మిషన్, నాయకులు,
సైనికులు
Trinethram News : రాజమహేంద్రవరం : ఐపీఎస్ అధికారి,దళితుల ధైర్యం పి.వి.సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అంబేద్కర్ మిషన ఇండియా నాయకులు , కార్యకర్తలు డిమాండ్ చేశారు.సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎం ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. డీజీపి రేసు నుంచి సునీల్ కుమార్ ను తప్పించేందుకే కుట్రలని వారంతా మండిపడ్డారు.
రాజమండ్రి లో ఏఐమ్ జిల్లా అధ్యక్షులు దొడ్డా నాగరాజు ఆద్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది.తొలుత
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళులర్పించిన ఏఐమ్
ఐ స్టాండ్ విత్ పి.వి.సునీల్ కుమార్ అంటూ నాయకులు భాస్కర్, కొయ్య శేఖర్ ,కోరుకొండ నాగేంద్ర,నరేష్, నాగేంద్ర,పెరవలి పండు, మరియు సైనికులు నినదించారు.దళిత సీనియర్ ఐపిఎస్ అధికారిపై కక్ష సాధింపు చర్యలను విరమించుకోవాలని ఎన్ డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.- పి.వి.సునీల్ కుమార్ కి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఏఐఎం నాయకులు
ఎన్ డిఏ కూటమి ప్రభుత్వం తీరుమార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
