శానిటేషన్, త్రాగునీరు సరఫరా వ్యవస్థ పరిశీలన
- కలక్టర్ పి ప్రశాంతి
Trinethram News : రంగంపేట : రామన్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్పష్టమైన త్రాగు నీరు ప్రజలకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
మంగళవారం రంగంపేట మండలం వీరం పాలెం, చంద్రేడు గ్రామాలలో ఎంపిడివో, ఇతర క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది సమక్షంలో పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇటీవల చంద్రేడు గ్రామంలో డయేరియా కేసు నమోదైందినీ, ఇందుకు శానిటేషన్ , స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా విధానం లో గ్రామ స్థాయి లో తీసుకున్న చర్యలను క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం రావడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రజలకూ త్రాగునీరు సరఫరా చేస్తున్న ఓ హెచ్ ఆర్ ట్యాంకి నిర్వహణా, క్లోరినేషన్ తదితర అంశాలపై వివరాలు తెలుసుకోవడం జరిగింది.
త్రాగునీరు, శానిటేషన్ నిర్వహణ వ్యవస్థ ను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆశా వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు తరచుగా ఇండ్ల ను తరచుగా సందర్శించి ఆరోగ్య పరమైన అంశాలను గుర్తించి తగిన చికిత్స అందించాలన్నారు. వేసవి దృష్ట్యా రానున్న రోజుల్లో వేడి తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవడం పై సూచనలు సలహాలు ఇవ్వాలని సూచించారు.
వీరం పాలెం గ్రామం లో ఓ హెచ్ ఆర్ నిర్వహణా, గ్రామంలో శానిటేషన్ తీరును పరిశీలించారు. పంచాయతీ సిబ్బంది చెత్త సేకరణ పై డోర్ టూ డోర్ ప్రచారం చేయడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
కలెక్టర్ వెంట ఎంపిడివో వివి సాయి బాబా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


