ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశమయింది

TRINETHRAM NEWS

ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

కేబినెట్ నిర్ణయాలు:

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్.

నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు ఆమోదం. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ కింద పని చేయనున్న పాలిటెక్నిక్ కాలేజీ.

డోన్ లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కాలేజీ ద్వారా వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమో కోర్సు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ కింద పని చేయనున్న కాలేజీ.

అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.

ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ఈ మూడు యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతి.

You cannot copy content of this page

Scroll to Top