Ramavat Ravindra Kumar : ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న స్పీకర్

TRINETHRAM NEWS

సభ నడిపించే విధానాన్ని స్పీకర్ మర్చిపోయాడా?
అసెంబ్లీలో స్పీకర్ వైఖరి దారుణం
తెలంగాణ శాసనసభ రోజురోజుకు విలువలుబి కోల్పోతోంది.
శాసన సభనా? గాంధీ భవనా?
అసెంబ్లీ నడుపుతున్నారా? సీఎల్పీ మీటింగ్ నడుపుతున్నారా?
ప్రశ్నిస్తే మైక్ కట్ చేసి ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న స్పీకర్ .
శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది.
స్పీకర్ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణి, అహంకారపూరిత వైఖరికి
నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను బిఆర్ ఎస్ పార్టీ పూర్తిగా బహిష్కరణ.

మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ జనవరి 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ శనివారం రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు.
కాంగ్రెస్ పాలనలో మార్పు లేదు.. తిరోగమనం మాత్రమే యూరియా కొరతతో రైతులు పడుతున్న బాధలను పాటించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంఇంకేమీపనిలేదన్నట్టుగా, రెండు సంవత్సరాలుగా కేవలం ప్రకటనలకే పరిమితమైనమూసీసుందరీకరణపై చర్చ పెట్టారు రైతు సమస్యలపై మాట్లాడాలంటే ఇంత భయమా?కనీసం చర్చకు రాకుండా పారిపోతారా?
నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి ఉపన్యాసాలు ఇస్తారా?కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో చెప్పబోతున్నారా? రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు అందించిందా? ఒక్క చెరువును బాగు చేసిందా? ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం అయితే, ప్రధాన ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇవ్వాల్సిందేనని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని స్పష్టం చేశారు. నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలి కాలంలో కూడా గంటల తరబడి, దినాల తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు.గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధివైపుకాదు,తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నదని మాజిశాసనసభ్యులురమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Speaker is choking the opposition

You cannot copy content of this page

Scroll to Top