భవిష్యత్తులో గ్రామాలు బాగుపడాలన్నా అది మళ్ళీ కేసీఆర్ తోనే సాధ్యం.
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 02 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు సాగుతున్నాయి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం దేవరకొండ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేరడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామానికి చెందిన పలువురు
బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రవీంద్ర కుమార్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ…..అవ్వ తాతలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామని బాండ్లు రాసిచ్చి, అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. యాసంగి రైతుబంధు పడలేదు, 2 లక్షల రుణమాఫీ సగం మందికి కూడా పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతుంది అని ఆయన తెలిపారు.ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆర్భాటంగా ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయింది .. ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? కొత్తవి దేవుడెరుగు, ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా నెలల తరబడి పెండింగ్ లో పెట్టి పేదల పెళ్లిళ్లకు సాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అని ఆయన అన్నారు.ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
ఒకప్పుడు కరువు, వలసలకు నిలయమైన నేడు దేశానికి ఆదర్శంగా, రోల్ మోడల్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ . ఆ అభివృద్ధిని కాపాడుకోవాలనీ అన్నారు. భవిష్యత్తులో గ్రామాలు బాగుపడాలన్నా అది మళ్ళీ కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్నారు అని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి, చిత్తు చిత్తుగా ఓడించాలి. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి, అందరి కష్టాలు తీరుతాయి అని ఆయన తెలిపారు.పార్టీలో చేరిన వారిలో మైనం వెంకటయ్య, కూర ఇదయ్య, కూర ఎల్లయ్య, కుక్కల మల్లయ్య,కూరచిన యాదయ్య,గుడిపల్లి లింగయ్య,కూర అంజి, కూర రత్నాలు, కుక్కల వెంకటయ్య, కుక్కల మల్లయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వడత్య బాలు, బొమ్ము గోవిందు, పెద్దగోల అంజయ్య, వడిత్య హనుమంతు, కాట్రావత్ హనుమంతు,లాలు, అంజి,బొమ్మ గంగిరాజు, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


