తేదీ : 14/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, నగర పంచాయతీ మధిర రోడ్డు , ఇందిరా , సుందరయ్య, చింతల కాలనీలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాధారణ అవసరాలకు కూడా నీరు సరిపడా దొరక్క అవస్థలు పడుతున్నారు. మనుషులతో పాటు పశు సంపద తల్లడిల్లుతున్న పరిస్థితి వివిధ వార్డుల్లో కనిపిస్తోంది.
పదకొండు,పన్నెండు,పదమూడు వ వార్డుల్లో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె వల్ల అవసరమైనటువంటి మంచినీళ్లు, వాటర్ ట్యాంక్ నుంచి వదలకుండా అమ్మే బాటలో నడుస్తున్న మున్సిపల్ కార్మికులు వాడుకోవడానికి, త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు స్థానిక వార్డు ప్రజలు పడుతున్నారు. తక్షణమే నీరు సమస్యను పట్టించుకుని తిరువూరు నగర్ పంచాయతి కమిషనర్ మునిసిపల్ ఏ ఈ సంబంధిత వాటర్ ట్యాంకుర్లు ద్వారా మంచినీరు సప్లై చేయాలని ప్రజలు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


