MLA Patsa Matla : చెక్కులు అందజేత

TRINETHRAM NEWS

తేదీ : 14/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గం, లో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే పత్స మట్ల. ధర్మరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అమౌంట్ మంజూరు చేయడం జరిగింది. ఈ నేపద్యంలో ముప్ఫై ఐదు మంది సంబంధిత లబ్ధిదారులకు రూపాయలు ముప్ఫై నాలుగు లక్షల,యాభై ఏడు వేల,తొమ్మిది వందల ఐదు . సీఎంఆర్ఎఫ్ విలువ గల చెక్కులను శాసనసభ్యులు తమ క్యాంపు కార్యాలయం నందు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నియోజకవర్గంలో నూట ఎనభై రెండు మంది లబ్ధిదారులకు గాను ఒక కోటి ,ఎనభై ఐదు లక్షల,నలబై ఒ క్క వేల,మూడు వందల, పది రూపాయలు మంజూరు కావడం జరిగింది అని తెలిపారు. లబ్ధిదారులందరూ వాళ్లకు సంబంధించి ఆర్థికంగా భరోసా కల్పించేలా చొరవ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు , గ్రామ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cheques will be handed

You cannot copy content of this page

Scroll to Top